వీనస్ విలియమ్స్ శుభారంభం
అమెరికా స్టార్ టెన్నిస్ ప్లేయర్ వీనస్ విలియమ్స్ సిన్సినాటి ఓపెన్‌లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 43 ఏళ్ల వీనస్ విలియమ్స్ 6-4, 7-5 తేడాతో 16వ సీడ్ వెరొనికా కుడెర్మొటోవా (రష్యా)పై విజయం సాధించింది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత వీనస్ 20 లోపు ర్యాంక్ క్రీడాకారిణీని ఓడించింది. 7 సార్లు గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచిన విలియమ్స్ గాయాలతో కొద్ది కాలంగా టోర్నీలకు దూరంగా ఉంటుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడిన వీనస్ గాయంతో రాణించలేకపోయింది. ప్రస్తుతం పాతా ఫామ్‌ను ప్రదర్శించిన వీనస్ తర్వాతి రౌండ్లో అడుగుపెట్టింది. ఇక్కడ జరిగిన మరో మ్యాచ్‌లో సలోనె స్టీఫెన్స్ ( అమెరికా) 7-5, 6-2 ఇటలీకు చెందిన ఎలిజాబెతా కొకియారిటోపై విజయం సాధించి ముందంజ వేసింది.













