చరిత్ర సృష్టించిన కమలా హారిస్.. 191 ఏళ్ల తర్వాత మళ్లీ
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా చరిత్ర సృష్టించిన కమలా హారీస్ మరో రికార్డు నెలకొల్పారు. భారత సంతతికి చెందిన కల్పనా కోటగల్ను అమెరికా సమాన ఉద్యోగ అవకాశాల కమిషన్ సభ్యురాలిగా నియమించే విషయంలో ఆమె టై-బ్రేకింగ్ ఓటు వేశారు. కల్పనా కోటగల్ను నియమించాలన్న ప్రతిపాదనకు అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. దీంతో ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ టై-బ్రేకింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికా చరిత్రలో ఉపాధ్యక్షుడు ఇలాంటి ఓటు హక్కు వినియోగించుకుకోవడం 191 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.






