ఆ ఇద్దరూ ఈ నెల 12న కలుస్తున్నారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మధ్య భేటీ ప్రక్రియ మళ్లీ ట్రాక్‌లో పడింది. ఆ ఇద్దరూ ఈ నెల 12వ తేదీన సింగపూర్‌లో కలుసుకోనున్నారు. కిమ్‌తో భేటీని రద్దు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ట్రంప్, మళ్లీ ఆ అంశంపై తాజాగా ఓ ప్రకటన చేశారు. ముందుగా అనుకున్నట్లే ఈనెల 12న కిమ్‌తో భేటీ ఉంటుందని ట్రంప్ వైట్‌హౌజ్‌లో మీడియా సమావేశంలో తెలిపారు. నార్త్ కొరియాకు చెందిన సీనియర్ నేతతో మంతనాలు జరిపిన తర్వాత ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. నార్త్ కొరియా నేత కిమ్ పంపిన లేఖను ఆ దేశ దౌత్యవేత్త జనరల్ కిమ్ యాంగ్ దాన్ని ట్రంప్‌కు అందజేశారు. కొరియా దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తలకు త్వరలోనే పరిష్కారం దొరకనున్నట్లు ట్రంప్ తెలిపారు. త్వరలో జరగబోయే సమావేశం ద్వారా నార్త్ కొరియా చేపడుతున్న వివాదాస్పద అణ్యాయుధ కార్యక్రమంపై తుది పరిష్కారం కుదరకపోయే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. ఒక్క మీటింగ్‌తోనే మొత్తం అయిపోదని, ఇదొక ప్రక్రియలా జరుగుతుందని, ఇప్పుడిప్పుడే సంబంధాలు బలపడుతున్నాయని, పాజిటివ్ దశలో ముందుకు వెళ్తున్నట్లు ట్రంప్ చెప్పారు.













