కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో పురోగతి : ట్రంప్
కరోనా చికిత్స, వ్యాక్సిన్ అభివృద్ధిలో అమెరికా ఎంతో పురోగతి సాధిస్తోందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సీనియర్ సిటీజన్స్పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా చికిత్స, వ్యాక్సిన్లో అమెరికా పురోగతి చైనాకు ఇష్టం లేదన్నారు. కరోనా టీకా, చికిత్స విధానాలపై పనిచేస్తున్న వారిని గొప్ప వ్యక్తులుగా ట్రంప్ అభివర్ణించారు. న్యూజెర్సీలో 18 ఏళ్ల యువకుడు కరోనాకు బలికావడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. కాగా జర్మనీ నుంచి 25 వేల మంది సైనికులను వెనక్కి రప్పిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ చర్య రష్యాకు లాభాదాయకమని, దేశ భద్రతకు ప్రమాదకరమని ఆయన సొంత పార్టీ నేతలే విమర్శించారు.













