ఐవీఎఫ్ ద్వారా పుట్టే పిల్లలకు కేన్సర్ ముప్పు!
కృతిమ గర్భధారణ (ఐవీఎఫ్) ద్వారా జన్మించే పిల్లలకు కేన్సర్ బారిన పడే ప్రమాదాలు ఎక్కువని అమెరికాలోని మిన్నెసొటా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. గత మూడు దశాబ్దాలుగా కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలను కనడం ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణం అయిపోయింది. అయితే, ఐవీఎఫ్ విధానం ద్వారా పిల్లలకు జన్మనివ్వడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఐవీఎఫ్ విధానం ద్వారా ఇప్పటికే పుట్టిన పిల్లలు, రానున్న రోజుల్లో పుట్టబోయే చిన్నారులు సైతం కేన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తమ పరిశోధనలో తేలినట్టు వారు చెబుతున్నారు.
ఐవీఎఫ్ ద్వారా పుట్టిన దాదాపు 275,686 పిల్లలు, సాధారణ పద్ధతుల్లో జన్మించిన పిల్లలకు సంబంధించిన డేటాను ఇందుకు తమ పరిశోధనలకు వినియోగించుకున్నట్టు తెలిపారు. ఇందులో దాదాపు పది లక్షల మంది ఐవీఎఫ్ పద్ధతుల ద్వారా జన్మించిన పిల్లలు ఉంటే దాదాపు సాధారణ పద్ధతుల్లో పుట్టిన పిల్లల కంటే 17 శాతం ఎక్కువగా కేన్సర్ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నట్టు జమా పీడియాట్రిక్స్ అనే జర్నల్ పేర్కొంది.













