TTA: టీటీఏ డల్లాస్ ఛాప్టర్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, ఏసీ, ఈసీ, బీవోడీ టీమ్స్‌కు డల్లాస్ ఛాప్టర్ ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యంగా డల్లాస్ టీం సభ్యులు బీవోడీ, డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రవీణ్ చింత, సేవ డేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, బీవోడీ సభ్యులు నరేష్ బైనగరి, వెంకట్ అన్నపరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే (TTA) రీజనల్ వైస్ ప్రెసిడెంట్లు సందీప్, శేఖర్, మహేష్, మహిళా బృందం సభ్యులను అభినందించింది. ఈ కార్యక్రమంలో 3 వేల మందికిపైగా అతిథులు హాజరై.. ఉత్సాహంగా హోలీ జరుపుకున్నారు. రంగులు చల్లుకోవడంతోపాటు లైవ్ డీజే, బ్యాండ్ ప్రదర్శన, 30పైగా హుక్కా కబానాలు, చిన్నారుల కోసం బౌన్స్ హౌస్‌లు, రుచికరమైన విందు, రిఫ్రెష్మెంట్స్, డ్యాన్సులతో ఈ (TTA) వేడుకలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగాయి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన స్పాన్సర్లు అందరికీ కూడా టీటీఏ (TTA) డల్లాస్ ఛాప్టర్ ధన్యవాదాలు తెలిపింది. అలాగే వేడుకలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన డల్లాస్ కోర్ టీం, బీవోడీలు, ఆర్వీపీలు, ఆర్సీలు, వాలంటీర్లు అందరూ కలిసి డల్లాస్‌ను ఆనందాతిరేకాల్లో ముంచేసినందుకు టీటీఏ డల్లాస్ ఛాప్టర్ సంతోషం వ్యక్తం చేసింది.







