TTA: టీటీఏ షార్లట్ ఛాప్టర్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన హోలీ సంబరాలు
తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (టీటీఏ) (TTA) షార్లట్ ఛాప్టర్ ఆధ్వర్యంలో మార్చి 15వ తేదీన హోలీ సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి 1500 మందికిపైగా హాజరై ఉత్సాహంగా హోలీ జరుపుకున్నారు. ఈ వేడుకలను టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది ముందుండి నడిపించారు. టీటీఏ షార్లట్ టీమ్ సభ్యులు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నిషాంత్ సిరికొండ (జాయింట్ సెక్రటరీ), శ్రీకాంత్ రెడ్డి గాలి (హెల్త్ అండ్ వెల్నెస్ అడ్వైజర్), అభిలాష్ ముదిరెడ్డి (బీవోడీ), నరేందర్ దేవరపల్లి (బీవోడీ), పల్లవి రమిడి (మహిళా ఫోరం అడ్వైజర్) తదితరులు ఈ వేడుకను విజయవంతం చేయడంలో ఎంతో కృషి చేశారు. రంగులు, సంగీతం, డ్యాన్సులతో ఈ వేడుకలు ఎంతో ఉత్సాహంగా జరిగాయి. పిల్లలు, పెద్దలు, కుటుంబాలు, స్నేహితులు అందరూ కలిసి హోలీ ఆడుతూ సరదాగా గడిపారు. ఈ క్రమంలోనే టీటీఏ (TTA) వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, ఏసీ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, కో-చైర్ డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోల్ల, ఏసీ సభ్యులు భరత్ రెడ్డి మాదాడి, శ్రీని అనుగు, ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, ఈసీ టీం సభ్యులకు షార్లట్ టీం కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే ఈ కార్యక్రమం స్పాన్సర్లకు కూడా ధన్యవాదాలు తెలిపింది.







