ఒలింపిక్స్ వద్దు : ట్రంప్
ఈ సంవత్సరం జపాన్ రాజధాని టోక్కోలో జరగాల్సిన ఒలింపిక్స్ పోటీలను నిర్వహించ వద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. కనీసం ఏదాడి పాటు పోటీలను వాయిదా వేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్‌ను మిగతా దేశాల నుంచి ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేదని, అప్పుడు పోటీలే బోసిపోతాయని అభిప్రాయడ్డ ఆయన క్రీడా టోర్నీలు రద్దయ్యాయని గుర్తు చేశారు. ప్రేక్షకులు లేకుండా ఇంత పెద్ద ఈవెంట్ జరగడం తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. కాగా కరోనా ప్రభావం ఎలా ఉన్నా పోటీలు ఆగబోవని, వీటిని ఆపబోమని టోక్కో గవర్నర్ యురికో కొయ్కే గతంలోనే సృష్టం చేసిన సంగతి తెలిసిందే. పోటీల్లో పాల్గొనాలని భావించే వారంతా ప్రాక్టీస్‌ను కొనసాగించాలని ఇటీవలే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కూడా సూచించింది.













