నవంబర్ 3వ తేదీనే దేశాధ్యక్ష ఎన్నికలు : ట్రంప్
ఈ ఏడాది అమెరికాలో దేశాధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అయితే ఆ ఎన్నికలు యధావిధిగా నవంబర్ 3వ తేదీనే జరుగుతాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టం చేశారు. ఆయన వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. జనరల్ ఎలక్షన్స్ నవంబర్ 3వ తేదీనే జరుగుతాయని ట్రంప్ అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఓటర్లు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేయడం కొంత ఆందోళన కలిగించే విషయమే. కానీ, ఈ-మెయిల్ ద్వారా ఓటింగ్ వేసే పక్రియను ట్రంప్ వ్యతిరేకించారు. ఈవెయిల్ ఓటింగ్ వల్ల అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని ట్రంప్ అన్నారు. ఈవెయిల్ ఓటింగ్‌తో చాలా మంది మోసం చేస్తారన్నారు. బూత్‌కు వెళ్లి గర్వంగా ఓటెయ్యాలన్నారు. ఓటరు ఐడీతోనే ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.













