ఆ దేశంతో ప్రమాదం… మళ్లీ మాట మార్చిన అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ మాట మార్చారు. ఉత్తర కొరియాతో అణు ప్రమాదం ఉందన్న సంకేతాలను ఆయన జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం ట్రంప్, కిమ్‌లు సింగపూర్‌లో చరిత్రాత్మక భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కడ ఇద్దరూ అణు నిరాయుధీకరణపై సంతకాలు చేశారు. దీంతో అణ్యాయుధ సమస్య తీరిందని భావించారు. ప్రపంచం హాయిగా నిద్రపోవచ్చు అంటూ ఆ మరుసటి రోజే ట్రంప్ ఓ ట్వీట్ కూడా చేశారు. కానీ తాజాగా ఆ అంశంపై ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఉత్తర కొరియా వల్ల అమెరికా భద్రతకు ముప్పు ఉందని, అందుకే ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ట్రంప్ తన తాజా సందేశంలో పేర్కొన్నారు. పదేళ్ల క్రితం జార్జ్ బుష్ ప్రభుత్వం విధించిన ఆర్థిక నిబంధనలనే కొనసాగించనున్నట్లు ట్రంప్ తన తాజా డికప్లరేషన్లో వెల్లడించారు.













