కొలంబియా డిస్ట్రిక్ట్ సర్క్యూట్ జడ్జిగా భారతీయ-అమెరికన్ మహిళ!
అమెరికాలో సుప్రీంకోర్టు తర్వాత అంతటి శక్తిమంతమైన కొలంబియా డిస్ట్రిక్ట్ సర్క్యూట్ కోర్టులో నియామకానికి గాను భారతీయ అమెరికన్ మహిళ నియోమి జహంగిర్ రావు(45)ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం సమాచార, నియంత్రణ వ్యహరాల కార్యాలయ పాలనాధికారిగా పనిచేస్తున్న ఆమెను ఈ జడ్డి పదవికి శ్వేతసౌధం మాజీ కౌన్సిల్ డాన్ మెక్‌గాన్ సిఫార్సు చేసినట్లు ఓ వార్తసంస్థ వెల్లడించింది. సుప్రీంకోర్టు అసోసియేట్ జస్టిస్‌గా పనిచేస్తున్న బ్రెట్ కేవనాఫ్ ఇంతకుముందు ఆ పదవిలో ఉండేవారు. అప్పట్లో ఆయన లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు కూడా ఎదుర్కొన్న విషయం గమనార్హం. కేవనాఫ్ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆయన స్థానంలో డిస్ట్రిక్ట్ సర్యూట్ కోర్టు జడ్జి పదవికి ట్రంప్ పలువురుని ఇంటర్వ్యూ చేశారు. వీరిలో మరో భారతీయ అమెరికన్ శ్రీ శ్రీనివాసన్ కూడా ఉన్నారు. మైనారిటీ మహిళగా రావు నియామకం పట్ల ట్రంప్ ఆసక్తితో ఉన్నట్లు వార్త సంస్థ పేర్కొంది.













