భారత్‌పై డొనాల్డ్ ట్రంప్ మరోసారి విమర్శలు
పారిస్ వాతావరణ ఒప్పందం విషయంలో తన నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు మిత్రదేశంగా చెప్పుకొనే భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ నోరుపారేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాయుకాలుష్యం పెరుగుదలకు భారత్, రష్యా, చైనా దేశాలు కారణమంటూ తీవ్ర విమర్శలు చేశారు. చైనాను చూడండి, ఎంత మురికిగా ఉందో. రష్యా, భారత్ వైపు చూడండి. అక్కడి గాలి మురికిగా ఉంది. ట్రిలియన్ల కొద్ది డాలర్లు వెచ్చించాల్సి ఉండటం, మాతో వారి ప్రవర్తన సరిగా లేకపోవడంతో మేం పారిస్ ఒప్పందం నుంచి బయటకు వచ్చా. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు, వేల సంఖ్యలో కంపెనీలను ఆ ఒప్పందం కోసం నేను త్యాగం చేయలేను. అది చాలా అన్యాయంగా ఉంది అంటూ అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తుది ముఖాముఖి సంవాదంలో ట్రంప్ పారిస్ ఒప్పందం నుంచి బయటకు రావడాన్ని సమర్థించుకున్నారు. అయితే, భారత్‌పై ట్రంప్ ఈ తీరుగా మాట్లాడడం ఇదే మొదటిసారేమీ కాదు.













