కిమ్ చాలా స్మార్ట్ : ట్రంప్
ఉత్తరకొరియా నుంచి ఎదురవుతున్న అణ్వస్త్ర ముప్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చాలా స్మార్ట్ అని, సరైన విధంగా వ్యవహరించే తీరు ఆయనకు తెలుసని తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ట్రంప్ ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని షింజో అబెతో సమావేశం అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అణ్వస్త్రాలతో చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆయనకు తెలుసు. ఆయన చాలా చురుకైన వ్యక్తి. అణ్వస్త్రాలను త్వజించాల్సిన ఉందని ఆయనకు తెలుసు. అప్పుడే ఉత్తరకొరియా ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటుందని అని వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియాను గొప్ప ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలని కిమ్ భావిస్తున్నట్లు తాను అనుకుంటున్నానని ట్రంప్ తెలిపారు. అణ్వస్త్రాలను అభివృద్ధి చేస్తుంటే మాత్రం ఇది సాధ్యం కాదని పేర్కొన్నారు.













