మాకేం సంబంధం లేదు : నాట్స్
మోదుగుమూడి కిషన్ ఉదంతంతో తమకు ఎటువంటి సంబంధం లేదని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాట్స్) పేర్కొంది. ఈ కేసు చార్జిషీటులో నాట్స్ గురించి ప్రస్తావన ఉన్న సంగతి తెలిసిందే. నాట్స్ పేరిట ఉన్న కొన్ని నకిలీ పత్రాలతో ఒక నటి అమెరికాకు వెళ్లిందనేది ఒక అభియోగం. దీనిపై స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు తమ షికాగో ప్రతినిధితో మాట్లాడారని, ఆ తర్వాత తమను ఎవరు సంప్రదించలేదని నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ తెలిపారు. తాము అతిథులకు జారీ చేసే ఉత్తరాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ ఘటన మా అందరికీ షాక్ కలిగిందించి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వ్యవస్థలను ఎలా బలోపేతం చేయడంపై దృష్టి పెడతాం అని నాట్స్ చైర్మన్ తెలిపారు.













