అమెరికాలో భారత సంతతి యువకుడికి ఏడాది జైలు
అమెరికాలో నివసిస్తున్న విదేశీ పౌరులను మోసం చేసిన కేసులో భారత్‌కు చెందిన 26 ఏళ్ల తూడి శివచందన రెడ్డికి టెక్సాస్ కోర్టు 12 నెలల ఒక్క రోజు జైలు శిక్ష విధించింది. అధికారుల కథనం ప్రకారం.. శివ చందన్ రెడ్డి టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లో నివాసం ఉంటూ 2015 నుంచి 17 వరకు న్యూహాంప్షైర్లో కళాశాల విద్యను అభ్యసించాడు. ఆ సమయంలో తానొక సినిమా నిర్మాతనని, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం కూడా ఉందని చెప్పి కొందరు విదేశీ విద్యార్థులను నమ్మించాడు. తనతో లాబాలు పంచుకోవాలంటే తన వెంచర్స్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అలా బాధితుల నుంచి లక్షా 60 వేల డాలర్లు వసూలు చేశారు. ఆ డబ్బుతో జల్లాసు చేశారు. దీంతో కోర్టు శివ చందన్ రెడ్డికి ఏ డాది జైలు శిక్ష విధించింది. శిక్ష ముగిసిన వెంటనే అతన్ని భారత్‌కు పంపించేసే అవకాశం కూడా ఉందని అధికారులు చెప్పారు.













