అగ్నిప్రమాదంలో తెలుగు విద్యార్థులు
అమెరికాలోని లూసియానాలో తెలుగు విద్యార్థులు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో 11 మంది విద్యార్థుల విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. ఇందులో ఏడుగురి పాస్‌పోర్టులు, ఒరిజినల్ సర్టిఫికెట్లు కాలిపోయాయి. అపార్ట్మెంట్లో మంటలు ఎగిసిపడడం గమనించిన విద్యార్థులు గదుల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. కట్టుబట్టలతో మిగిలిన విద్యార్థులకు తెలంగాణకు చెందిన విజయ్ తుపల్లి కావాల్సిన ఏర్పాట్లను చేశారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, అమెరికన్ తెలుగు అసోసియేషన్, దత్త టెంపుల్ కమిటీ నిర్వాహకులు విద్యార్థులకు అండగా నిలిచారు.













