హెచ్-1 బీ వీసాల టాప్ 10లో టీసీఎస్ చోటు
అమెరికా హెచ్-1 బీ వీసాలకు సంబంధించి ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ పొందిన టాప్ 10 కంపెనీల్లో దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు చోటు దక్కించుకుంది. సెప్టెంబరు 30తో ముగిసిన 2018 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ మొత్తం 20,755 హెచ్-1బీ లేబర్ సర్టిఫికేషన్స్ పొందింది. 1,51,164 సర్టిఫికేషన్స్‌తో ప్రొఫెషనల్ సర్వీసెస్ దిగ్గజం ఎర్న్స్ట్ అండ్ యంగ్ అగ్ర స్థానంలో ఉన్నట్లు అమెరికా కార్మిక శాఖ ఒక నివేదికలో తెలియజేసింది. టాప్ 10లో చోటు దక్కించుకున్న సంస్థల్లో ఇండియా నుంచి టీసీఎస్ ఒక్కటే ఉండటం విశేషం. మిగతా సంస్థల్లో డెలాయిట్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ అమెరికా, కె ఫోర్స్, యాపిల్ తదితర సంస్థలున్నాయి. విదేశీ నిపుణులను తమ దేశంలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు అమెరికా హెచ్-1బీ వీసా జారీ చేస్తుంది.













