ఫ్యూచర్ టెక్నాలజీపై టాస్క్ పట్టు.. మే 4 నుండి AI, GenAI శిక్షణ ప్రారంభం
TASC: దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం (TASC) విద్యార్థుల కోసం ప్రస్తుత టెక్నాలజీ అవసరాలకు అనుగుణంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తెచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో నైపుణ్యాన్ని పెంచేందుకు 6 వారాల సమగ్ర ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను టాస్క్ నిర్వహిస్తోంది. మే 4, 2026 నుండి జూన్ 11, 2026 వరకు ఈ శిక్షణ కొనసాగుతుంది.
ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు ఏఐ (AI), జనరేటివ్ ఏఐ (GenAI), , ఏజెంటిక్ ఏఐ (Agentic AI) వంటి అత్యాధునిక అంశాలపై లోతైన అవగాహన కల్పిస్తారు. ప్రతి వారం సోమవారం నుండి గురువారం వరకు సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు క్లాసులు జరుగుతాయి.
శిక్షణలోని అంశాలు..
- ఏఐ ప్రాథమిక అంశాలు , జనరేటివ్ ఏఐ పరిచయం.
- ఏజెంటిక్ ఏఐ , దాని నిజ జీవిత ఉపయోగాలు.
- ప్రాక్టికల్ లెర్నింగ్ , ఇంటరాక్టివ్ సెషన్స్.
- ఏఐ వినియోగంలో పాటించాల్సిన నైతిక విలువలు.
నిర్వాహక బృందం..
టాస్క్ అధ్యక్షులు కొండలరావు వయినేని, సెక్రటరీ శంకర్ సింగంశెట్టి, ట్రెజరర్ మహేష్ నూకల , కార్యవర్గ బృందం ఈ వినూత్న కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆసక్తి గల విద్యార్థులు పోస్టర్లోని క్యూఆర్ (QR) కోడ్ లేదా వాట్సాప్ గ్రూప్ లింక్ ద్వారా వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
మరిన్ని వివరాలకు పవన్ సుంకర (480-427-6373), కృష్ణ చైతన్య ఇన్టీ (909-362-2068) లను సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి








