తానా జానపదకళావైభవం- వంగపండు ప్రసాదరావుతో ముఖాముఖీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతినెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ దృశ్య సమావేశంలో భాగంగా మే 31వ తేదీన ఆదివారంనాడు జానపదకళా వైభవం పేరుతో జానపద ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు ముఖాముఖీ కార్యక్రమం జరుగుతుంది. ఐదు దశాబ్దాలకుపైగా జానపద కళాసేవ, కార్మిక కష్టాలు, గిరిజన సమస్యలు, సామాజిక స్పృహ నేపథ్యంగా వందలాది పాటలను రచించిన స్వరకర్త, గాయకుడు అయిన వంగపండు ప్రసాదరావు తానా ప్రపంచ సాహిత్య వేదిక కార్యక్రమంలో భాగంగా తానా సభ్యులతో మాట్లాడనున్నారని తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి తెలిపారు. తానా మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం, మే 31, 2020 (9am PST; 11 am CST; 12 noon EST & 9:30 pm IST).
Meeting link:
https://tana.webex.com/tana/j.php?MTID=md6320421e1988f9266591b0ce5f8ee40
Watch Live on:
https://www.facebook.com/TANA.org
You can also watch Live on
MANATV & TV5 INTERNATIONAL
ఈ కార్యక్రమానికి సంబంధించి వివరాలకోసం ఫ్లయర్ను చూడండి.













