న్యూజెర్సీ అగ్ని ప్రమాద బాధిత విద్యార్థులకు తానా సహాయం
న్యూజెర్సీలో ఇటీవల ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కష్టాల పాలయ్యారు. అందులో ఒక విద్యార్థికి తీవ్రగాయాలు పాలుకాగా, 6గురు తెలుగు విద్యార్థులు నిరాశ్రయులయ్యారు. న్యూజెర్సీలోని బేయోన్లో నివసిస్తున్న న్యూయార్క్ పేస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు ఈ దురదృష్టకర అగ్ని ప్రమాదంతో సర్వస్వం కోల్పోయి ఇబ్బందులకు గురయ్యారు. తానా టీమ్ స్క్వేర్ టీమ్ వెంటనే స్పందించి విద్యార్థులకు సహాయం చేసింది. తానా టీమ్ స్క్వేర్ కో-చైర్ శ్రీనివాస్ భర్తవరపు బాధిత విద్యార్థులను పరామర్శించారు. తక్షణ సహాయం కోసం కిరాణా సామాగ్రిని అందించారు. తానా సెక్రటరీ రాజా కసుకుర్తి తాత్కాలిక ఆశ్రయం పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వస్త్రాలు మరియు తక్షణ అవసరాల కోసం 1000 డాలర్ల గిఫ్ట్ కార్డులను అందించారు. టీమ్ స్క్వేర్ చైర్ కిరణ్ కొత్తపల్లి, శ్రీనివాస్ భర్తవరపు, ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఓరుగంటి, న్యూజెర్సీ తానా రీజినల్ కోఆర్డినేటర్ రామకృష్ణ వాసిరెడ్డి, ఎన్ఆర్ఐ స్టూడెంట్ సర్వీసెస్ చైర్ శ్రీనాథ్ కోణంకి ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా తానా బృందం బీమా మరియు ఆస్తి యజమాని నుండి సహాయం పొందడానికి అవసరమైన మార్గదర్శకత్వాలను తెలియజేసింది. తమ సహాయం కూడా ఉంటుందని హామీ ఇచ్చింది.
విద్యార్థులకు ల్యాప్టాప్ లు…
ఇల్లినాయిలోని మోలిన్ కు చెందిన దాతలు డాక్టర్ వెంకటేశ్వరరావు మొవ్వ మరియు వేద మొవ్వల సహాయంతో తానా ఫౌండేషన్ వారు విద్యార్థులకు ల్యాప్టాప్లను అందించారు. తమకు అందించిన సహాయానికి తానా టీమ్ మొత్తానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి, తానా బిఓడి సెక్రటరీ లక్ష్మీ దేవినేని, తానా ఫౌండేషన్ సెక్రటరీ విద్యా గారపాటి, ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఓరుగంటి, టీమ్ స్క్వేర్ టీమ్ కిరణ్ కొత్తపల్లి, శ్రీనివాస్ భర్తవరపు, ఎన్జే రీజనల్ కోఆర్డినేటర్ రామకృష్ణ వాసిరెడ్డి, ఎన్జే రీజనల్ కోఆర్డినేటర్ రామకృష్ణ వాసిరెడ్డికి తానా సెక్రటరీ రాజా కసుకుర్తి కృతజ్ఞతలు తెలిపారు. సతీష్ మేక, తారా విక్రమ్, శివాని తానా, శ్రీనివాస్ ముప్పరాజు, మరియు తులసిరామ్ కొడాలి విద్యార్థులకు సహాయం అందించారు.







