కాకుమాను విద్యార్థికి తానా ఫౌండేషన్ చేయూత
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కాకుమాను గ్రామానికి చెందిన వెట్టం వెంకటేష్ అనే యువకుడు నిరుపేద కుటుంబంలో జన్మించి చదువుల్లో రారాజు Nit అగర్తల త్రిపుర రాష్ట్రం లో CSE లో ఉచితంగా సీటు సాధించారు మూడో సంవత్సరం చదువుకున్న యువకుడికి లాప్ టాప్ అవసరం ఉండగా అతను తానా ఫౌండేషన్ సహకారం అందించాలని కోరారు. ప్రవాస ఆంధ్రులు దేవినేని లక్ష్మి, సామినేని రవి, ఉప్పుటూరి రామ చౌదరి, సహకారంతో దేవినేని లక్ష్మి, తానా ఫౌండేషన్ ద్వారా 48 గంటల్లో వెంకటేష్ కు కాకుమాను జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు జవహర్ రాణి మరియు స్కూల్ Pet గోపి చేతుల మీదుగా ఈరోజు కాకుమానులు అందజేశారు. వెట్టం వెంకటేష్ మాట్లాడుతూ… ఈ సహకారం నేను చదువుకొని ఉద్యోగం చేస్తూ నేనింకో ఒకరికి సహాయపడతారు తానా ఫౌండేషన్ వారికి రుణపడి ఉంటానని వారన్నారు. బాగా చదువుకునే విద్యార్థులకు మరియు నిరుద్యోగ మహిళల ఉపాధి కోసం తానా ఫౌండేషన్ ముందుంటుందని అన్నారు.













