విద్యార్థులకు పారితోషికాలు అందించిన తానా మాజీ కార్యదర్శి పొట్లూరి రవి
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నలుగురు నర్సింగ్ చదువుతున్న విద్యార్థునులకు, ఇద్దరు స్కూలు విద్యార్థులకు తానా మాజీ కార్యదర్శి, ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి మరియు హెల్ప్ 2 సి సంస్థ సహకారంతో నిర్మల హృదయసేవా సంస్థలో లక్ష రూపాయల పారితోషికాలు అందజేశారు.
తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న చేయూత కార్యక్రమంలో భాగంగా నిర్మల, రోజ్ మేరీ, లక్ష్మీ దేవి, కోటేశ్వరి లకు పారితోషికాలు అందించినట్లు, నిర్మల హృదయ సంస్థలో విద్యార్థులు ఎవరి అండ లేకపోయినా అన్నీ అవరోధాలు దాటుకుని నర్సింగ్ డిగ్రీ అభ్యసించడం ఆదర్శప్రాయమని, భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని పొట్లూరి రవి తెలిపారు. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో హైస్కూల్లో చదువుకుంటూ హెల్ప్ 2 సి సంస్థ ద్వారా అనాథ విద్యార్థులకు, వృద్దులకు సహాయం అందిస్తున్న అపర్ణ వాగ్వాల సేవలను కొనియాడారు. కరోనా వైరస్ తీవ్రత వలన తల్లితండ్రులు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న మాచర్లకు చెందిన విద్యార్థులు లోకాదిత్య, నిఖిల్ లకు పదివేల చొప్పున పారితోషికం అందించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ 46వ వార్డు కార్పొరేటర్ బాలాజీ నూకవరపు ముఖ్య అతిధిగా హాజరైన ఈ కార్యక్రమంలో నిర్మల హృదయ సేవా సంస్థ విద్యార్థులకు స్కూలు బ్యాగులు, నోటు పుస్తకాలు పంపిణీ చేసారు.
పారిశ్రామికవేత్త ముప్పా రాజశేఖర్, సురేష్, వెంకటేశ్వర రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













