న్యూజెర్సిలో తానా-క్యూరీ పోటీలకు 150 మంది హాజరు
న్యూజెర్సిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), క్యూరీ సంస్థలు సంయుక్తంగా ఏప్రిల్ 29న వివిధ పోటీలను ఏర్పాటు చేశాయి. ఈ పోటీల్లో 2 నుండి 7వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. గణితం, సైన్స్ మరియు స్పెల్ మాస్టర్ విభాగాలలో జరిగిన ఈ పోటీల్లో 150 మందికి పైగా పాల్గొన్నారు. ఈ పోటీలను తానా న్యూజెర్సీ న్యూయార్క్ ప్రాంత నాయకులు విద్యాధర్ గారపాటి, లక్ష్మి దేవినేని, రాజా కసకుర్తి, శ్రీనాథ్ కోనంకి, శ్రీనివాస్ ఓరుగంటి, సుధీర్ నరేపాళెపు, వంశి వాసిరెడ్డి, రాధిక అంకెం, రత్న మూల్పూరి తదితరులు దగ్గిరుండి పర్యవేక్షించారు. స్థానిక తెలుగు కళా సమితి (టిఫాస్) కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ పోటీలకు న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ బోర్డ్ కమీషనర్ ఉపేంద్ర చివుకుల ముఖ్య అతిధిగా విచ్చేసారు. గెలిచిన విద్యార్ధులకు ఆయన అభినందన పత్రాలు అందజేశారు.













