బులుసు జీవనవాహిని కి తానా పురస్కారం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఇటీవల నిర్వహించిన పద్య, గేయ, కావ్య పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలోని తగరపువలసకు చెందిన పద్యకవి బులుసు వెంకటేశ్వర్లు రచించిన జీవనవాహిని కి ప్రథమ బహుమతి లభించింది. సినీ గేయ రచయిత దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి జ్ఞాపకార్థం, తానా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలకు దేశ విదేశాల్లోని 91 మంది రచయితలు తమ రచనలు పంపారు. ఇందులో పద్య కావ్య విభాగంలో జీవనవాహినిన ప్రథమ స్థానంలో నిలిచి ఈ-బుక్ ప్రచురణకు ఎంపికయింది. పురస్కారంతో పాటు రూ.లక్ష నగదు బహుమతి అందించనున్నారు. ఈ మేరకు తానా అధ్యక్ష, కార్యదర్శులు లావు అంజయ్య చౌదరి, తోట కూర ప్రసాద్ సంబంధిత వివరాలను ఆయనకు పంపారు.













