అట్లాంటాలో ఘనంగా స్వరాభిషేకం
అట్లాంటాలో మాజీ ముఖ్యమంత్రి, నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టినరోజును పురస్కరించుకుని పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ‘స్వరాభిషేకం’ కార్యక్రమం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్టీఆర్ నటించిన పలు హిట్ సినిమాల్లోని పాటలను గాయనీ గాయకులు పాడి వినిపించారు. మూడు గంటలపాటు కొనసాగిన ఈ కార్యక్రమం సెక్ట్సన్ కమ్యూనిటీ హల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాడాల్సిన పాటలను ఎమ్.సీ. నీలిమ గడ్డమనుగు ఎంపిక చేశారు.
కార్యక్రమంలో గాయకులు రామ్ దుర్వాసుల, భానుశ్రీ వావిలకొలాను, వెంకట్ చెన్నబోతుల, ఫణీ డోక్క, శాంతి మేడిచర్ల, లక్ష్మీ వెదాల, ఉష మోచర్ల, శ్రీవల్లి శ్రీధర్, హరిణి యనమందల, శిరిష దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, నీలిమ గడ్డమనుగు, మేఘన పోటుకుచి వీరంతా కలిసి మొత్తం 30 ఎన్టీఆర్ పాటలు పాడారు. పాటలే కాకుండా కార్యక్రమంలో లవకుశ సినిమాలోని పద్యాలను రామ్ దుర్వాసుల, శాంతి మేడిచర్ల అలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత గేయ రచయిత, కవి జొన్నవిత్తుల ముఖ్య అతిథిగా హజరయ్యారు. తాను ఎన్టీఆర్‌కు పెద్ద అభిమానిని అని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని తెలిపారు. అంతేకాకుండా కొన్ని పద్యాలను కూడా అలపించారు. తరువాత రామ్ దుర్వాసుల చేతుల మీదుగా జొన్నవిత్తులకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌గా ‘మైత్రీ’ ఆర్గనైజేషన్ వ్యవహరించింది. జాగ్ ఆడియో సహకారం అందించారు. అలాగే జి.వి. రావు ఏ.వి. అండ్ ఫోటోగ్రఫీ సహకారం అందించారు. రవి పోగినేని మీడియా కవరేజీ అందించారు. వీడియో ప్రొజెక్షన్ రాధాకాంత్ స్వయంపాకులా అందించారు. విజ్జు చెవురాలా కోఆర్గనైజర్గా వ్యవహరించారు.













