శ్రీ వెంకటేశ్వర్ లోటస్ టెంపుల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్!

అమెరికాలోని శ్రీవెంకటేశ్వర లోటస్ టెంపుల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 13 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ క్యాప్ జరుగుతుంది. కమ్యూనిటీ అవుట్‌రీచ్‌లో భాగంగా ప్రతి నెలా ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామని లోటస్ టెంపుల్ హామీ ఇచ్చింది. ఈ క్యాంప్‌లో బ్లడ్ ప్రెజర్, బ్లడ్ గ్లూకోజ్, హార్ట్ రేట్, ప్రస్తుత మెడికేషన్ రివ్యూ, ప్రత్యేక వైద్యానికి రిఫరల్స్ అన్నీ ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర లోటస్ టెంపుల్ వేదికగా జరిగే ఈ క్యాంప్‌లో చెకప్ కోసం ఎలాంటి ఇన్సూరెన్స్ అక్కర్లేదు.