న్యూయార్క్ సలహా సంఘంలో ఇద్దరు ప్రవాస భారతీయులు
కరోనా కారణంగా నష్టపోయిన న్యూయార్క్ రాష్ట్ర ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించడానికి ఏర్పాటు చేసిన సంఘంలో ఇద్దరు భారతీయ అమెరికన్లకు చోటు దక్కింది. పులిట్జర్ అవార్డు గ్రహీత, వైద్యుడు సిద్ ముఖర్జీ, విద్యావేత్త సతీశ్ త్రిపాఠి. ఈ మేరకు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో వీరి పేర్లును ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న న్యూయార్క్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు 15 మందితో బ్లూ రిబ్బన్ కమిషన్ ను ఏర్పాటు చేశారు. భారత్లో జన్మించిన ముఖర్జీ అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. కేన్సర్ వైద్యుడిగా మంచి పేరుంది.













