రష్యా-సౌదీ ధరల యుద్ధానికి ఫుల్స్టాప్
కరోనా నేపథ్యంలో చమురుకు డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో ధరలను అదుపులోకి తెచ్చేందుకు ఉత్పత్తి తగ్గిస్తున్నారు. నెల రోజులకు ముందే ఈ అంశంపై ఒపెక్ దేశాలు చర్చించినప్పటికీ, రష్యా-సౌదీ మధ్య ప్రెస్ వార్ చోటు చేసుకుంది. ఇప్పుడు ఎట్టకేలకు విజయవంతమైంది. ఉత్పత్తి తగ్గింపునకు అన్ని దేశాలు అంగీకరించడంతో చమురు ధరలపై ప్రభావం పడింది. క్రూడ్ ఫ్యూచర్ ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడాయిల్ ప్యూచర్స్ 52 సెంట్లు లేదా 1.7 శాతం తగ్గి.. 30.96 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ప్యూచర్స్ 12 సెంట్లు లేదా 0.5 శాతం మేర తగ్గి 22.64 డాలర్లు పలికింది.













