అమెరికా కాంగ్రెస్ ఎన్నికల బరిలో భారతీయ అమెరికన్లు
అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో ఈ దఫా రికార్డు స్థాయిలో 20 మంది భారతీయ అమెరికన్లు బరిలో దిగనున్నారు. రానున్న నవంబరులో జరగనున్న ఈ ఎన్నికల కోసం వారంత కలిసి ఇప్పటివరకు రూ.102 కోట్లకు పైగా నిధులు సమీకరించారు. వారిలో ఏడుగురు రూ.7 కోట్లకు పైగా నిధుల చొప్పున సమాకూర్చుకున్నారు. ఇల్లినాయిస్లోని 8వ కాంగ్రెస్ జిల్లా నుంచి పోటీ చేయనున్న రాజా కృష్ణమూర్తి (డెమోక్రాట్) అత్యధికంగా సుమారు రూ.23 కోట్లు సమీకరించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ జితేందర్ దిగాంకర్ ఆయనతో తలపడనున్నారు. కృష్ణమూర్తి ప్రస్తుతం ఇల్లినాయిస్ 8వ కాంగ్రెస్ జిల్లా నుంచే ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి గమనార్హం. ఇప్పటికే కాంగ్రెస్ సభ్యులుగా ఉన్న రో ఖన్నా, అమీ బెరా, ప్రమీలా జయపాల్ కూడా ఒక్కొక్కరు రూ.7 కోట్ల కంటే అధికమొత్తాన్ని సమీకరించారు. ఫెడరల్ ఎన్నికల కమిషన్ తాజాగా ఈ వివరాలు వెల్లడించింది.













