విద్యార్థికి ల్యాప్టాప్ అందించిన రవి సామినేని
తానా ఆదరణ – రవి సామినేని గారి ఉదారత. ఖమ్మంకి చెందిన ఆటో డ్రైవర్ కుమారుడు పి.సంతోష్ నిరుపేద ఇంజనీరింగ్ విద్యార్ది విజ్ఞప్తికి స్పందించి కొలంబస్ కి చెందిన రవి సామినేని గారు ల్యాప్టాప్ ని బండి నాగేశ్వరరావు గారి ద్వారా అందచేసారు. ఈ సందర్బంగా సంతోష్ మాట్లాడుతూ ఈ సహాయం చేసిన దాత శ్రీ.రవి సామినేని గారికి, తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు గారికి, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ గారికి కృతజ్ఞతలు తెలియచేసారు.
తాను కూడ జీవితంలో నిలదొక్కుకున్న తరువాత ఈ యజ్ఞంలో పాలుపంచుకొని ఇతరులకు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేసారు.













