స్వదేశం నుంచే ఆ పనిని పూర్తి చేయొచ్చు : రాజ్‌నాథ్
రఫేల్ యుద్ధ విమానాలు భారత వైమానికి దళ పోరాట సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆ విమానాలు చేతికందాక, పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడానికి భారత బలగాలు సరిహద్దులను దాటి వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. స్వదేశం నుంచే ఆ పనిని పూర్తిచేయొచ్చని వ్యాఖ్యానించారు. భారత్-అమెరికా 2+2 చర్చల్లో పాల్గొనేందుకుగాను అమెరికా చేరుకున్న రాజ్‌నాథ్. న్యూయార్క్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం ప్రభావం భారత్‌పై కూడా ఉందని రాజ్‌నాథ్ తెలిపారు. స్వల్ప కాలంలోనే మనదేశ ఆర్థిక వ్వవస్థ విషమ పరిస్థితులను అధిగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.













