హెచ్-1బీ ప్రీమియం ప్రాసెసింగ్
హెచ్-1 బీ వీసా దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుందని అమెరికా ప్రకటించింది. 2019 ఆర్థిక సంవత్సరానికి గానూ దాఖలైన అన్ని హెచ్-1బీ క్యాప్ పిటిషన్లను పరిశీలించనున్నట్లు తెలిపింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకే ఇది వర్తిస్తుందని, కొత్తవాటిని స్వీకరించట్లేదని సృష్టం చేసింది. ప్రీమియం ప్రాసెసింగ్ కింద పిటిషన్‌దారులు అదనంగా రుసుము చెల్లించి తమ దరఖాస్తుల పరశీలన ప్రక్రియను 15 రోజుల్లోనే పూర్తిచేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో పిటిషన్లు పేరుకుపోవడంతో ఇటీవల కొంత కాలం ఈ ప్రక్రియను అమెరికా నిలిపివేసింది. కొన్ని విభాగాల్లో ఈ నిలిపివేత ఇంకా కొనసాగుతోంది.













