ఎప్పుడుబడితే అప్పుడు భోజనం చేస్తున్నారా జాగ్రత్త!
వేళాపాళా లేకుండా ఎప్పుడుబడితే అప్పుడు భోజనం చేస్తున్నారా? జాగ్రత్త. వేళ తప్పి ఆలస్యంగా తింటే తీవ్ర అలసట, ఊబకాయం, హృదయ సంబంధ సమస్యలు చుట్టుముట్టే ప్రమాదముందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. మెదడులోని మాస్టర్ గడియారం, శరీరం లోని నాడీ తదితర గడియారాలకు అనుగుణంగా, లయబద్ధ జీవక్రియలకు శరీరం అలవాటు పడుతుంది. ఆహార వేళలకూ, ఈ జీవ గడియారాలకు దగ్గరి సంబంధం ఉందనీ, వేళ తప్పి తింటే, శరీర క్రియలు గతితప్పి ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని సరీ విశ్వవిద్యాలయం తాజాగా చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రివేళ భోజనాలను ఐదు గంటల ఆలస్యంగా తీసుకోవడం వల్ల, జీవ క్రియలు కూడా ఆ మేరకు జాప్యమవుతాయని గుర్తించినట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన జోన్తాన్ జాన్స్టన్ తెలిపారు.













