పాఠశాల చిన్నారుల ప్రతిభ అద్భుతం
ఫిలడెల్ఫియాలోని వ్రూచెస్ పాఠశాల కేంద్రంలో తెలుగు చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న శ్రీమతి పద్మాలక్ష్మీని పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు ఘనంగా సత్కరించారు. ఇక్కడ ఉన్న చిన్నారులకు తెలుగు పద్యాలను నేర్పించడంతోపాటు వారితో టాబా రీజినల్ కాన్ఫరెన్స్లో పద్యపఠన ప్రదర్శన చేయించినందుకుగాను ఇక్కడి పాఠశాల యాజమాన్యాన్ని టీచర్లను సుబ్బారావు అభినందించారు. పాఠశాల చిన్నారులు సులభంగా తెలుగు పద్యాలను చెప్పడాన్ని ఆయన తిలకించారు.
సౌత్ జెర్సి తెలుగు అసోసియేషన్ నాయకులను కలిసి పాఠశాల విషయమై వారితో సుబ్బారావు చర్చించారు. ఈ సందర్భంగా టిఎఎస్జె అధ్యక్షుడు సాయి జరుగుల సుబ్బారావుకు మెమోంటోను అందజేసి ఘనంగా సత్కరించారు. వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్ నిర్వహిస్తున్న ఉగాది వేడుకల్లో కూడా సుబ్బారావు పాల్గొని తెలుగు భాష అభివృద్ధికి పాఠశాల ద్వారా చేస్తున్న కృషిని తెలియజేశారు.













