అవుట్డోర్ డైనింగ్ … అమెరికాలో భలేమోజు
కరోనా వైరస్ మానవాళి పెను మార్పులు తీసుకొచ్చిన సంగతి విదితమే. ఒకప్పుడు బయటి తిండి తినడమే ఫ్యాషన్‌గా భావించిన వారు, ఇప్పుడు ఆ పేరు చెప్తేనే ఆమడ దూరం పెరిగెడుతున్నారు. రెస్టారెంట్లు అన్ని కరోనా దెబ్బకు ఖాళీ అయ్యారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ రెస్టారెంట్లు ఓ వినూత్న ఆలోచన చేశాయి. అవుట్డోర్ డైనింగ్ (బహిరంగ భోజనం)ని అమలు చేశాయి. ఇది బాగా క్లిక్ అయింది. దాంతో ఈ విధానాన్ని వర్మినెంట్ చేయాలని భావిస్తున్నట్లు న్యూయార్క్ మేయర్ బిల్ డీ బ్లాసియో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాత్కాలిక పద్ధతిన ప్రవేశపెట్టిన ఈ విధానం బాగా క్లిక్ అయింది. నగర వాసులు కూడా దీన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో ఈ పద్ధతిని శాశ్వతంగా అమలు చేయాలని భావిస్తున్నాం అన్నారు. ఈ నెల 30 నుంచి న్యూయార్క్ నగరంలో 25 శాతం ఆక్యుపెన్సీ పరిమితితో ఇండోర్ రెస్టారెంట్లు తెరచుకోనున్న నేపథ్యంలో మేయర్ ఈ ప్రకటన చేయడం విశేషం. కీలకమైన ఆహార పరిశ్రమకు మద్దతు ఇవ్వడంతో ఓపెన్ రెస్టారెంట్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇది చాలా పెద్ద, దైర్యమైన ప్రయోగం. పైగా విజయవంతమయింది. దీని ద్వారా 90 వేల మందికి ఉపాధి కల్పించాము అని బ్లాసియో తెలిపారు.













