శాన్ఫ్రాన్సిస్కోలో అంగరంగ వైభవంగా ఉస్మానియ సంబరాలు
ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది వేడుకలను అమెరికాలో కూడా ఘనంగా జరిపారు. బే ఏరియాలో జరిగిన ఈ ఉత్సవాలకు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ అలూమ్ని అసోసియేషన్, ఉత్తర అమెరికా బే ఏరియా చాప్టర్ సభ్యులు, బే ఏరియాలోని ఇతర తెలుగు సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలు అందరినీ ఆకట్టుకునేలా సాగాయి. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం ముఖ్య అతిధిగా పాల్గొని ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణ గా నిలిచారు. తెలుగు యూనివర్సిటీ వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ఎస్.వి సత్యనారాయణ, తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.సత్తిరెడ్డి, కేంద్ర హిందీ ప్రచార సమితి సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు ఈ సభకు హాజరయ్యారు.
వందేళ్లల్లో ఉస్మానియా యూనివర్సిటీ సాధించిన ప్రగతి, గత వైభవాన్ని అలూమ్ని, అడాబ్ సిస్టమ్స్ సీఈఓ శాంతన్ నారాయణ కళ్లకు కట్టినట్లు వివరించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించిన చేసిన ప్రసంగాన్ని ముందుగా ప్లే చేయ డంతో సభ్యులంతా కరతాళ ధ్వనులతో ఆమోదించారు. నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు ఉస్మానియాలో జరిగిన సంఘటనలను వీడియో రూపంలో చూపించారు. ఏప్రిల్ 26, 1917న ఉస్మానియా యూనివర్సిటీని నిజాం ప్రభుత్వం ప్రారంభించిన సంగతులను ఫొటోల రూపంలో ప్రదర్శించారు. వీడియోల ద్వారా అక్కడి సంగతులను మెసేజ్ రూపంలో చెప్పారు. ఓయూ అల్యుమినీ సభ్యులు సయ్యద్ బషరత్ అలీ.
భారతదేశలోనే ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేక స్థానం ఉందని, అలాంటి యూనివర్సిటీలో పనిచేయడం తనకు గర్వంగా ఉందని ఓయూ వీసీ రామచంద్రం అన్నారు. ఎందరో విద్యార్థుల జీవితాలను ఉన్నతస్థితికి తీసుకువచ్చిన ఓయూను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు తెలుగు యూనివర్సిటీ వీసీ సత్యనారాయణ మాట్లాడుతూ దేశానికి ఎంతో మంది మేధావులను అందించిన ఘనత ఓయూకు ఉందన్నారు భారత కాన్సులేట్ జనరల్ అధికారి వెంకటరమణ. ఓయూ ఎందరో విద్యార్థుల జీవితాలను మార్చిందన్నారు. తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఫౌండర్ సభ్యులు విజయ్ చావా తదితరులు మాట్లాడుతూ, ప్రధాని పివి. నరసింహరావులాంటి మేధావులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిదేనని చెప్పారు.













