టీఆర్ఎస్ విజయం కోసం ఎన్ఆర్ఐల హోమం
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఎన్నారై లండన్ టీఆర్ఎస్ శాఖ ప్రత్యేక హోమం చేపట్టింది. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం చేశారు. ఎన్నారై టీఆర్ఎస్ యూకే కార్యవర్గ సభ్యులు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలకు హాజరయ్యారు. కొండగట్టు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కటుంబ సభ్యులకు భగవంతుడు మనోదైర్యాన్నివ్వాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, మాజీ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసరీ వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.













