పాక్ తో ఎలాంటి ఒప్పందం లేదు..బేషరతుగా విడుదల చేయాలి
పాకిస్థాన్ కస్టడీలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను స్వదేశానికి తీసుకురావడంపై పాకిస్థాన్‌తో రాజీపడే ప్రసక్తే లేదని భారత్ సృష్టం చేసింది. మా అధికారిని వెంటనే, బేషరతుగా స్వదేశానికి పంపాలి. ఇందుకోసం పాకిస్థాన్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదని భారత్ సృష్టంగా చెప్పింది అని విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించిన పాకిస్థాన్ వైమానికి దళాన్ని తిప్పికొట్టే క్రమంలో ఐఏఎఫ్‌కి చెందిన మిగ్21 యద్ధవిమానం ఒకటి పాక్ భూభాగంలో కూలిపోయింది. పాక్ విమానాలను తిప్పికొట్టిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు పాకిస్థాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్‌కి చెందిన ఎఫ్-16 విమానాన్ని కూడా ఐఏఎఫ్ కూల్చివేసింది.













