న్యూయార్క్ లో కరోనా తీవ్రం….
అమెరికాలోని న్యూయార్క్‌లో కోవిడ్ 19 వైరస్ బీభత్సంగా విస్తరిస్తుండటంతో అక్కడ మరణమ•దంగం మోగుతోంది. మొత్తం అమెరికాలో ఇప్పటివరకు 1300 కరోనా మరణాలు నమోదు కాగా.. అందులో ఏకంగా 36 శాతం అంటే 466 మరణాలు కేవలం న్యూయార్క్‌లోనే నమోదయ్యాయి. ఆతర్వాత న్యూజెర్సీ కోవిడ్-19 బారినపడి అల్లాడుతోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు అమెరికా వ్యాప్తంగా ఇప్పటికే (భారత కాలమాన ప్రకారం శుక్రవారం ఉదయం 11 గంటలు) 159 కొత్త కేసులు నమోదు కాగా ఐదు మరణాలు సంభవించాయి. తాజాగా టెక్సాస్‌లో అత్యధికంగా 74 కొత్త కేసులతో పాటు మూడు మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో అగ్రరాజ్యంలో కరోనా బాధితుల సంఖ్య 85,595కు చేరగా… ఒక్క న్యూయార్క్‌లోనే 38,957 దాదాపు 45 శాతం నమోదు కావడం అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.













