భారతీయ టెంపుల్ ఆధ్వర్యంలో అమెరికాలో నవరాత్రి ఉత్సవాలు

అగ్రరాజ్యం అమెరికాలోని భారతీయ టెంపుల్ మరియు భారతీయ కల్చర్ సెంటర్ ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. పెన్సిల్వేనియాలో ఆదివారం మొదలయ్యే ఈ వేడుకలు అక్టోబర్ 24 వరకు జరుగుతాయి. ఆదివారం నాడు శైలపుత్రి పూజ, సోమవారం బ్రహ్మచారిణి అవతారంలో పూజ, మంగళవారం చంద్రఘంట పూజ, బుధవారం కూష్మాండ పూజ, గురువారం స్కందమాత పూజ, శుక్రవారం కాత్యాయని పూజ, శనివారం కాళరాత్రి పూజ, వచ్చే ఆదివారం ఆయుధ పూజ మరియు దుర్గాష్టమని హవనం, సోమవారం దుర్గా విసర్జనం అనంతరం మంగళవారం నాడు విజయదశమి వేడుకలు నిర్వహిస్తారు. శుక్రవారం సత్యనారాయణ పూజ, శరత్ పూర్ణిమ గర్బతో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈ వేడుకలకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో వస్తారని నిర్వాహకుల అంచనా.