టెంపాలో షరిఫ్స్ ఇండియన్ అడ్వైజరీ కౌన్సిల్ టు గెదర్ మీట్
హాజరైన నాట్స్ ప్రతినిథులు
అమెరికాలో ఉండే ప్రవాస భారతీయులను ఏకం చేసే అనేక సంస్థలు, సంఘాలు ఉన్నాయి. అలాంటి ఏ సంస్థ ఏ కార్యక్రమం తలపెట్టినా..ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ కూడా అందులో భాగస్వామి అయ్యేందుకు ఎప్పుడూ ముందుంటుంది. టెంపాలో షరిఫ్స్ ఇండియన్ అడ్వైజరీ కౌన్సిల్ బిల్డింగ్ ఎ స్ట్రాంగర్ కమ్యూనిటీ టుగెదర్ అనే సదస్సు ఏర్పాటు చేసింది. దీనికి నాట్స్ సలహా కమిటీ సభ్యులు శేఖరంగారితో పాటు నాట్స్ సభ్యులు కూడా దీనికి హజరయ్యారు. ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఈ సదస్సులో పాల్గొని ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే గీతాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. అమెరికాలో ఉండే సవాళ్లు.. వాటిని అధిగమించే మార్గాలపై కూడా ఇందులో చర్చించారు. భారతీయులంతా కలిసి ఉంటే అమెరికాలో భారతజాతి సాధించుకునే ప్రయోజనాలపై సమీక్షించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రవాస భారతీయులకు అవార్డులు ప్రదానం చేశారు.













