NATS: నాట్స్ ఆధ్వర్యంలో శశికళ పెనుమర్తి ‘నాట్యాభినయ తోరణం’

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) లలిత కళా వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ కళాకారిణి శ్రీమతి శశికళ పెనుమర్తి “నాట్యాభినయ తోరణం” అనే ప్రత్యేక ప్రదర్శన చేయనున్నారు. నాట్య శిరోమణి, నాట్య విశారద బిరుదులు పొందిన ఆమెతో ముఖాముఖి కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 21 తేదీ ఉదయం 11 గంటల ఈఎస్‌టీ (EST) గంటలకు జరగనుంది. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ శ్రీధరి మందాడి నేతృత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమం గురించి ఎలాంటి వివరాలు తెలుసుకోవాలన్నా నాట్స్ (NATS) నిర్వహణ కమిటీలో కి. భా.శ్రీ (Chair), సాయి యర్రప్రగడ, మురళి కృష్ణ మెడిచెర్ల, శ్రీనాథ్ జంధ్యాల, కిషోర్ నరే, గిరి కంభంమెట్టు, ప్రశాంతి రామ్, బాపు నూతిని సంప్రదించవచ్చని నాట్స్ తెలిపింది. నాట్స్ (NATS) కార్యనిర్వాహక కమిటీ సభ్యులు శ్రీహరి మందాడి, రాజ్ అల్లాడ, హరినాథ్ బంగాటవుల, శ్రీనివాసరావు భీమినేని, హేమంత్ కొల్లా, భాను ప్రకాష్ ధూలిపాళ్ల, శ్రీనివాస్ చిలుకూరి, రాజేష్ కండ్రు, రామ్ కొమ్మనబోయిన, మురళి కృష్ణ మెడిచెర్ల, రవికిరణ్ తుమ్మల, ఫలాక్ష్ అవస్థి, సుధీర్ మిక్కిలినేని, రవి కుమార్ తండ్ర, రమణ కుమార్ రాకోటు, భాను లంక, ఇమాన్యుయెల్ నీల, కిషోర్ నారే, సంకీర్త్ కటకం, కిరణ్ మందాడి, రామకృష్ణ బాలినేని, వెంకట్ మంత్రి, రాజలక్ష్మి చిలుకూరి, కిషోర్ గరికపాటి, శ్రీనివాస్ మెంటా, వెంకట్రావ్ దగ్గుబాటి, నాగ సుమంత్ రామినేని, సత్య శ్రీరామనేని, శ్రీహరీష్ జమ్ముల, మనోహర రావు మద్దినేని తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు.