NATS: బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి నాట్స్ 85లక్షల విరాళం
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) రూ.85 లక్షల విరాళం అందించింది. ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల ముగింపు కార్యక్రమంలో నిర్వాహకులు బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్, సినీనటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna), వసుంధర దంపతులకు జీవిత సాఫల్య పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ, నాట్స్ సభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటి విరాళం చెక్కును బాలకృష్ణకు అందజేశారు. ఎన్టీఆర్ గ్లోబల్ లిటరేచర్ కమిటీ రూపొందించిన ‘శక పురుషుడు’ పుస్తకాన్నీ ఆవిష్కరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో సినీ నటులు జయసుధ, మీనా, శ్రీలీలను నాట్స్ ప్రతినిధులు సత్కరించారు. సంబరాల్లో శాసనసభా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, సినీనటుడు వెంకటేశ్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, గౌతు శిరీష, వసంత కృష్ణప్రసాద్, చదలవాడ అరవిందబాబు తదితరులు పాల్గొన్నారు.







