కళ్యాణం…కమనీయం… కన్నుల పండువగా దుర్గ-నాదెళ్ళ గంగాధర్ల కుమార్తె వివాహం
అమెరికాలోనూ, తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు చిరపరిచితులైన శ్రీ గంగాధర్ నాదెళ్ళ కుమార్తె దీప నాదెళ్ళ వివాహం చికాగో వాస్తవ్యులు ప్రశాంత్ కోవెలమూడితో జూలై 25వ తేదీన శనివారం ఉదయం 9.55 గంటల సుముహూర్తంలో డెట్రాయిట్ లోని గంగాధర్ నాదెళ్ల స్వగృహంలో తెలుగు సంప్రదాయాలతో కమనీయంగా, అత్యంత వైభవంగా జరిగింది.. తెలుగు సంప్రదాయం ప్రకారం తొలుత గౌరీపూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుడిని పెళ్ళి మంటపానికి తీసుకురావడం, పూజలు నిర్వహించిన తరువాత జీలకర్ర,బెల్లం, మాంగళ్యధారణ వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు హాజరైన ఎంతోమంది ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఘనంగా జరిగిన ఈ వివాహానికి అమెరికాలోని అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.













