విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా భామ
విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా భామ డెమి-లేహ్ నెల్ పీటర్స్ ఎంపికయ్యారు. అమెరికాలోని లాస్వేగాస్లో తుది పోటీలు నిర్వహించగా, ఇందులో డెమి విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఓ దక్షిణాఫ్రికా అమ్మాయి ఈ కిరీటాన్ని దక్కించుకోవడం విశేషం. 1978లో దక్షిణాఫ్రికా చివరిసారిగా విశ్వసుందరి గౌరవాన్ని అందుకుంది. మొత్తం 92 మంది అమ్మాయిలు ఈ పోటీల్లో పాల్గొనగా, వారందరినీ దాటి డెమి తొలిస్థానం దక్కించుకున్నారు. కొలంబియాకు చెందిన లారా గొంజాలెజ్ తొలి రన్నరప్‌గా, జమైకాకు చెందిన డెవీనా బెన్నెత్ రెండో రన్నరప్‌గా నిలిచారు. 22 ఏళ్ల డెమి బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేశారు.













