వలసొచ్చిన వారికి ఆర్థిక సాయం చేయని అమెరికా
అమెరికాలో వలస వచ్చిన వారిని పెండ్డి చేసుకున్నవారికి కరోనా నివారణ కోసం ఇస్తున్న ఆర్థిక సహాయం ఇవ్వడం లేదు. అమెరికా పౌరులకు పెద్దలకు 1200 డాలర్లు, పిల్లలకు 500 డాలర్లు ఇచ్చే పథకాన్ని వలస వచ్చిన వారిని పెండ్లి చేసుకున్న దంపతులకు నిరాకరిస్తున్నారు. వారి ప్లిలలకు కూడా ఇవ్వడం లేదు. దానితో ఆ కుటుంబాల వారు ఈ డబ్బులు మాకు బతుకు నిలబెట్టుకోవడానికి మాత్రమే సరిపోతాయి అవి కూడా నిరాకరిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మేము ఏండ్ల తరబడి ఇక్కడే ఉంటూ పనులు చేసుకుంటూ బతుకుతున్నాము. ఈ విపత్కర కాలంలో సహాయం నిరాకరించడానికి దీన్ని ఒక సాకుగా చూపడం బాధకరం అని వలస కార్మికుల సమస్యలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థల వారు తెలియచేస్తున్నారు.













