యునిసెఫ్ అంబాసిడర్ గా మిల్లీ బ్రౌన్
ప్రముఖ అమెరికన్ నటి మిల్లీ బాబీ బ్రౌన్ తాజాగా యూనిసెఫ్ గుడ్‌విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. న్యూయార్క్‌లోని యూనిసెఫ్ కేంద్ర కార్యాలయంలో జరిగిన వరల్డ్ చిల్డ్రన్స్‌డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో 14 ఏళ్ల మిల్లీ బాబీ బ్రౌన్‌ను యంగెస్ట్ వెర్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికచేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బ్రౌన్ మాట్లాడుతూ యూనెసెఫ్ అంబాసిడర్ కావాలని నేను కన్న కలలు సాకారమయ్యాయి. ఇది యూనెసెఫ్ తరపున నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నేను చిన్నారులుతో సమావేశమై వారి కథలను విని వారికి స్ఫూర్తినందించే ప్రయత్నం చేస్తానని తెలిపింది.













