మెంఫిస్ సంక్రాంతి సంబరాల్లో కూచిపూడి నృత్య శోభ!
సహజ కవి, భావ కవి కీర్తిశేషులు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కొలువైతివా రంగ సాయి సుప్రసిద్ధమైన గీతం వినడానికి వీనులకి యెంత విందుగా ఉంటుందో సాంప్రదాయ నృత్యాన్ని జోడిస్తే ఇక కన్నుల పండుగే. మెంఫిస్ ఇండియన్ బాలే థియేటర్ నర్తకీమణులు సహస్ర ససిపల్లి, శాన్వి కుంటమల్ల, అస్మిత రెడ్డి బొడ్దు, అమృత గరుడాద్రి, నిధి నిహారిక మరియు నిక్ష చెన్నం, సాత్విక మరియు రిత్విక సెంథిల్ కుమార్ ఫిబ్రవరి 15న మెంఫిస్ తెలుగు సమితి వారు నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అద్భుతంగా ప్రదిర్శించారు. స్పిరిట్యుయల్ ఫౌండేషన్, ఆర్ట్స్ మెంఫిస్ మరియు టెన్నీస్సీ ఆర్ట్స్ కమిషన్ వారి సహకారంతో శ్రీమతి చంద్రప్రభ వాసిలి నృత్య దర్శకత్వంలో ఇండియన్ బాలే థియేటర్ చిన్నారులు కూచిపూడి నృత్య శోభలతో మెంఫిస్ ప్రవాస తెలుగు వారికి కనువిందు చేసారు.
Dr. Ramana Vasili
901-387-9646
ramanavvasili@hotmail.com
Spiritual Foundaiton
7062 South Beringer Drive
Cordova, Tennessee 38018 USA













