జీన్స్ లో మరో కొత్త డిజైన్… చూస్తే షాకవ్వాల్సిందే!
జీన్స్‌లో రకరకాల ట్రెండ్స్ నడుస్తున్నాయి. మొదట్లో హై వెస్టెడ్, తరువాత మామ్ కట్, నెక్స్ట్ స్కీనీ, ఇలా జీన్ చరిత్రలో పలు ట్రెండ్స్‌ను చూస్తునే ఉన్నాం. అయితే ఇప్పుడు జీన్స్‌లో మరో కొత్త డిజైన్ నూతన అనుభూతిని అందించేందుకు వచ్చింది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన ప్రముఖ బ్రాండ్ ఇటీవల ఈ నూతన జీన్స్‌ను ఆవిష్కరించింది. దీనిలో 95 శాతం జీన్స్ ఉండీటేనట్లు కనిపిస్తుంది. ఇదే దీని ప్రత్యేకత. దీనికి ఆ బ్రాండ్, ఎక్స్ ట్రీమ్ కట్ అవుట్ జీన్స్ అనే పేరు పెట్టింది. కాగా ఈ జీన్స్ ప్యాంట్ ధర రూ.12 నుంచి 20 వేల వరకూ ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఈ జీన్స్ అత్యధిక రిలాక్స్ అందిస్తుందని, దీనిని ధరించిన వారు అద్భుతమైన అనుభూతిని పొందుతారని ఆ సంస్థ తెలిపింది. అయితే ఈ సంగతి తెలుసుకున్న నెటిజన్లు పలు కామెంట్లు గుప్పిస్తున్నారు. ఒక యూజర్ తక్కువలో తక్కువగా చిన్న జేబు అయినా ఉంది అనగా, మరొకరు ఎయిర్‌పోర్లులో సెక్యూరిటీ ఏరియాలో సులభవంగా తొలగించుకోవచ్చు అని కామెంట్ చేశాడు.













