సంచలన నిర్ణయం…. త్వరలో ప్రపంచ దేశాలకు శుభవార్త
ఉత్తర కొరియా అద్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసేసుకున్నాడు. అణు పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేసి, అమెరికాతో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఈ విషయాన్ని అటు అమెరికా, ఇటు ఉత్తర కొరియా అధికారులు ధృవీకరించారు. ఉత్తర కొరియా- అమెరికా అధికారులు ఈ విషయమై గత కొంత కాలం రహస్య మంతనాలు జరుపుతున్నారు. ఆదివారం ప్యోంగ్యాంగ్ అధికారులు నేరుగా సంకేతాలను పంపారు. త్వరలో తటస్థ ప్రదేశంలో ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కావాలని ఇరు ప్రతినిధులు నిర్ణయించారు. అయితే అందుకు సానుకూల వాతావరణం ఏర్పడాల్సిన అవసరం ఉందని అమెరికా భావిస్తోంది. త్వరలోనే దీనిపై ప్రపంచ దేశాలు శుభవార్తను వింటాయ్ అని అమెరికా విదేశాంగ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి ప్రత్యేక దూతలు కూడా జోక్యం చేసుకున్నట్లు సమాచారం.













